Priya: షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బృందంలోని ప్రియ!

Priya set to work for Sharmila party as per reports
  • తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ
  • వేగంగా సన్నాహాలు
  • రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తున్న షర్మిల
  • ఇవాళ లోటస్ పాండ్ లో షర్మిలతో ప్రియ భేటీ
తెలంగాణలో పార్టీ స్థాపించేందుకు వైఎస్ షర్మిల చురుగ్గా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. కాగా, షర్మిల పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బృందంలోని ప్రియ వ్యవహరించనున్నారు. ఈ మేరకు షర్మిల పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 ప్రియ తమిళనాడులోని తిరువళ్లూరు ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె. ఇవాళ హైదరాబాదులోని లోటస్ పాండ్ నివాసంలో షర్మిలను ప్రియ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జులై 8న వైఎస్సార్ పుట్టినరోజు సందర్భంగా షర్మిల తన పార్టీ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. పార్టీ పేరును 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ'గా ఇప్పటికే రిజిస్టర్ చేసినట్టు కథనాలు వచ్చాయి.
Priya
Sharmila
Political Party
Stratagist
Telangana

More Telugu News