Chandrababu: తెలుగు మూలాలున్న శిరీష బండ్ల భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తోంది: చంద్రబాబు

Chandrababu appreciates Sirisha Bandla who set to fly off with VSS Unity
  • రోదసి యానానికి సిద్ధమైన వర్జిన్ గెలాక్టిక్
  • ఎంపికైన శిరీష బండ్ల
  • జులై 11న అంతరిక్ష ప్రయాణం
  • భారత సంతతి మహిళలు సత్తా చాటుతున్నారన్న చంద్రబాబు
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిర్వహించే అంతరిక్ష యానానికి అమెరికా భారత సంతతి అమ్మాయి శిరీష బండ్ల కూడా ఎంపికవడం తెలిసిందే. శిరీష బండ్ల తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా భారత సంతతి మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారని కొనియాడారు.

తెలుగు మూలాలున్న శిరీష బండ్ల జులై 11న వీఎస్ఎస్ యూనిటీ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. రోదసి యానంలో సరికొత్త అధ్యాయానికి ఈ ప్రయాణం తెరలేపుతోందని, శిరీష బండ్ల ఇప్పుడు భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తోందని చంద్రబాబు కొనియాడారు. 
Chandrababu
Sirisha Bandla
VSS Unity
Virgin Galactic
Telugu
India

More Telugu News