TDP: తమ పదవీ కాలం ముగిసిపోలేదంటూ శాసనసభ కార్యదర్శికి టీడీపీ నేతల లేఖలు

Letters from TDP leaders to the Legislative Secretary stating that their tenure is not over
  • మా పదవీకాలం ఆగస్టు 11 వరకు ఉంది
  • జూన్ 18నే పదవీ విరమణ చేసినట్టు ప్రకటించడం దారుణం
  • అప్పటి వరకు తమను ఎమ్మెల్సీలుగా కొనసాగించండి
ఎమ్మెల్సీలుగా తమ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీ వరకు ఉందని, కానీ జూన్ 18నే తాము పదవీ విరమణ చేసినట్టు శాసనసభ వర్గాలు ప్రకటించడం దారుణమని పేర్కొంటూ టీడీపీ నేతలు రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, ద్వారపురెడ్డి జగదీశ్‌రెడ్డి శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులుకు వేర్వేరుగా లేఖలు రాశారు.

 కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం వచ్చే నెల 11వ తేదీ వరకు తమ పదవీ కాలం ఉందని, అప్పుడే తాము పదవీ విరమణ చేస్తామని గత నెల 7న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి రాసిన లేఖ ప్రతిని కూడా ఆ లేఖలకు జతచేశారు. కాబట్టి తమను అప్పటి వరకు ఎమ్మెల్సీలుగానే కొనసాగించాలని కోరారు. ఒకవేళ అప్పటి వరకు కొనసాగించడం సాధ్యం కాకుంటే పదవీకాలం ముగిసినట్టు ప్రకటించడానికి కారణం ఏమిటో కూడా చెప్పాలని ఆ లేఖల్లో డిమాండ్ చేశారు.
TDP
MLCs
YVB Rajendraprasad
AP Legislative Council

More Telugu News