Vizianagaram: సీమ పందుల వాహనంపై వందమంది దాడి.. విశాఖ జిల్లాలో ఘటన

Hundreds attack pig vehicle in Visakhapatnam district
  • విజయనగరం నుంచి విత్తన పందులతో చెన్నైకి బయలుదేరిన వ్యాన్
  • విశాఖ జిల్లా సరిహద్దు వద్ద ఎస్కార్డు సిబ్బందికి వాహనం అప్పగించిన విజయనగరం పోలీసులు
  • బైక్‌లపై వచ్చిన వందమంది దుండగులు
  • డ్రైవర్‌ సహా ముగ్గురిపై దాడిచేసి వాహనంతో పరారీ
పోలీసుల ఎస్కార్టుగా ఉన్న సీమ పందుల వాహనంపై దాడిచేసిన వందమంది దానిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులను కొట్టి బయటకు లాగేసిన దుండగులు వ్యాన్‌ను విశాఖ వైపునకు తిప్పారు. వాహనాన్ని పోలీసులు వెంబడించడంతో దానిని వదిలేసి పరారయ్యారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. విజయనగరంలోని సీమ పందుల ఉత్పత్తి కేంద్రం నుంచి మునిసిపల్ అధికారులు 40 విత్తన పందులను చెన్నైకి తరలిస్తున్నారు. వ్యాన్‌తోపాటు ఎస్కార్టుగా వచ్చిన విజయనగరం పోలీసులు విశాఖ జిల్లా సరిహద్దు వద్ద ఆ జిల్లా ఎస్కార్డు సిబ్బందికి వాహనాన్ని అప్పగించి వెనుదిరిగారు. వాహనం చెన్నై వెళ్తుండడంతో విశాఖ జిల్లా సరిహద్దు వరకు వ్యాన్‌కు రక్షణగా వెళ్లాలని సూచించారు.

సరిహద్దు నుంచి బయలుదేరిన వ్యాన్ కాగిత టోల్‌గేట్ వద్దకు రాగానే బైక్‌లపై వచ్చిన వందమంది దుండగులు వాహనంపై దాడిచేశారు. వ్యాన్ డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులను చితకబాది వ్యాన్ నుంచి బయటకు లాగేసి వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని విశాఖవైపు మరల్చారు. మిగిలిన వారు బైక్‌లతో వాహనాన్ని అనుసరించారు.  

మరోపక్క, వెనక రక్షణగా వచ్చిన పోలీసులు గాయపడిన వారిని వాహనంలో ఎక్కించుకుని దుండగులను వెంబడించారు. పందుల వాహనం నక్కపల్లిలోని చేనేత కాలనీకి చేరుకోగానే దుండగులు వ్యాన్‌ను వదిలేసి, తాళాలు తీసుకుని పరారయ్యారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. స్థానికుల సాయంతో దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.
Vizianagaram
Visakhapatnam
Pigs
Van
Police

More Telugu News