Allu Arjun: 'అసురన్' నిర్మాత బ్యానర్లో అల్లు అర్జున్!

Allu Arjun next movie with Kalaipuli S Thanu
  • షూటింగు దశలో 'పుష్ప'
  • నెక్స్ట్ మూవీ 'ఐకాన్' అంటూ టాక్
  • తెరపైకి మురుగదాస్ పేరు
అల్లు అర్జున్ తాజా చిత్రంగా 'పుష్ప' సెట్స్ పై ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగు పూర్తికానుంది. దాదాపు దసరా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆయన 'ఐకాన్' సినిమా చేయనున్నాడని అంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ముందుగా మురుగదాస్ సినిమా చేయాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

అయితే తమిళంలో నిర్మాతగా కలైపులి థాను బ్యానర్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన బ్యానర్లో స్టార్ హీరోల సినిమాలు వరుసగా రూపొందుతూ ఉంటాయి. విజయ్ వంటి స్టార్ హీరోలతో ఆయన నిర్మించిన భారీ సినిమాలు తెలుగులోను ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆ చర్చలు కార్యరూపాన్ని దాల్చుతాయని భావిస్తున్నాను" అన్నారు. దాంతో ఇది మురుగదాస్ ప్రాజెక్టు కోసమేనని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన మురుగదాస్ తో 'తుపాకి' .. 'పోలీసోడు' సినిమాలు చేశారు.
Allu Arjun
Kalaipuli S Thanu
Murugadoss

More Telugu News