Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడిపై ఉన్న రెండు కేసులను ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt revoke two Cases against MLA jakkampudi Raja
  • పోలీసు అధికారులను దూషించిన ఆరోపణలపై రెండు కేసులు
  • విజయవాడ ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో విచారణ
  • కేసులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై విచారణలో ఉన్న రెండు కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అంతు చూస్తానని బెదిరించిన ఆరోపణలపై రాజాపై గతంలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.

విజయవాడలోని ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రస్తుతం ఈ కేసుల విచారణ నడుస్తోంది. ఇప్పుడీ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పిటిషన్ దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.
Andhra Pradesh
Jakkampudi Raja
East Godavari District
Criminal Cases

More Telugu News