Shalina D Kumar: మరో భారత అమెరికన్ కు కీలక పదవినిచ్చిన జో బైడెన్!
- మిచిగన్ ఫెడరల్ జడ్జిగా షాలినా డీ కుమార్
- సివిల్, క్రిమినల్ కేసుల బాధ్యతలు కూడా
- ఉత్తర్వులు వెలువరించిన శ్వేతసౌధం
అమెరికాలో మరో భారత మహిళకు అరుదైన గౌరవం లభించింది. మిచిగాన్ తూర్పు ప్రాంత ఫెడరల్ కోర్టు చీఫ్ జస్టిస్ గా షాలినా డీ కుమార్ ను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. ఆమె 2007 సంవత్సరం నుంచి ఓక్లాండ్ కౌంటీ ఆరవ కోర్టు న్యాయమూర్తిగా సేవలను అందిస్తున్నారు. 2018లో సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా ఆమెను మిచిగన్ సుప్రీం కోర్టు నియమించింది.
ఆమె తన చీఫ్ జస్టిస్ విధులతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల బాధ్యతలనూ నిర్వర్తిస్తారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. 1993లో మిచిగన్ వర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్, ఆపై 1999లో డెట్రాయిట్ మెర్సీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయ పట్టాను పొందారు.