Kavitha: మొన్న కుమారుడు, నేడు భర్త... సీనియర్ సినీ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం

Senior actress Kavitha lost her husband due to corona
  • కవితకు తీరని శోకం
  • జూన్ 15న కుమారుడు కన్నుమూత
  • రెండు వారాల వ్యవధిలో భర్త మృతి
  • ఇద్దరినీ బలిగొన్న కరోనా
ఇటీవల కుమారుడ్ని కోల్పోయిన సీనియర్ నటి కవిత... మరోసారి విషాదాన్ని ఎదుర్కొన్నారు. ఆమె భర్త దశరథరాజు నేడు కన్నుమూశారు. ఆయన గత కొన్నిరోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. ఆయనకు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.

ఇటీవలే కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో మృతి చెందారు. ఆ విషాద ఘటన మరువకముందే కవిత కుటుంబం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. కవిత తనయుడు సంజయ్ రూప్ జూన్ 15న మరణించాడు. రెండు వారాల వ్యవధిలో భర్త కూడా పోవడంతో కవితను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు.

దశరథరాజు సింగపూర్ కు చెందిన వ్యాపారవేత్త. కవిత, దశరథరాజుల పెళ్లి 1984లో జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  
Kavitha
Husband
Dasaratha Raju
Death
Corona Virus
Hyderabad
Telangana
Andhra Pradesh
Tollywood

More Telugu News