Nara Lokesh: బాలా మామకు అభినందనలు: నారా లోకేశ్

Nara Lokesh congratulates Balakrishna
  • బసవతారకం కేన్సర్ ఆసుపత్రి లక్షల మంది ప్రాణాలు కాపాడుతోంది
  • ప్రజాసేవ కోసం సాయం చేస్తున్న దాతలకు అభినందనలు
  • ఆసుపత్రి మెరుగైన వైద్యం అందిస్తోందని నీతి ఆయోగ్ కూడా ప్రకటించింది
బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఈరోజు కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్న బాలా మామ (బాలకృష్ణ)కు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రజా సేవ కోసం ఆసుపత్రికి సహాయం చేస్తున్న దాతలకు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి అభినందనలు అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి మెరుగైన వైద్యం అందిస్తోందని నీతి ఆయోగ్ కూడా ప్రకటించిందని... ఇది చాలా సంతోషకరమని చెప్పారు. కేన్సర్ చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి ఉండాలని స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఆశయం నెరవేరిందని అన్నారు.
Nara Lokesh
Balakrishna
Telugudesam
Basavatharakam Hospital

More Telugu News