Rashmika Mandanna: నాకు కాబోయే భర్తకు ఈ లక్షణాలు ఉండాలి: రష్మిక మందన్న

My husband should be like a common man says Rashmika Mandanna
  • కాబోయే భర్త మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి
  • ఆర్భాటాలు లేకుండా సాధారణ వ్యక్తిలా ఉండాలి
  • నాకు స్మోకింగ్ అంటే అసహ్యం
టాలీవుడ్ లో కన్నడ భామ రష్మిక మందన్న ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమా ఆఫర్లతో అగ్ర నటిగా కొనసాగుతోంది. మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆమె అవకాశాలను చేజిక్కించుకుంటోంది. 'మిషన్ మజ్ను' అనే సినిమాతో పాటు, 'గుడ్ బాయ్' అనే  చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తోంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ... సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది.
 
తాజాగా తన అభిమానులతో ఆమె సోషల్ మీడియా వేదిక ద్వారా కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. మీరు స్మోక్ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా... తనకు స్మోకింగ్ అంటే అసహ్యమని చెప్పింది. స్మోక్ చేసే వారి పక్కన నిలబడాలన్నా తనకు చాలా ఇబ్బందిగా  ఉంటుందని తెలిపింది.
 
మీ భర్త ఎలా ఉండాలనే ప్రశ్నకు సమాధానంగా... మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలని రష్మిక చెప్పింది. హంగులు, ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిగా కనిపించాలని తెలిపింది.
Rashmika Mandanna
Tollywood
Husband

More Telugu News