Congress: రాహుల్​ కు ఫొటోతో కౌంటర్​ ఇచ్చిన సిద్ధూ

Sidhu Counters Rahul With a Photo that He meets Priyanka
  • ఎలాంటి భేటీ లేదని నిన్న రాహుల్ కామెంట్
  • ఇవాళ ప్రియాంకను కలిసి ఫొటో ట్వీట్ చేసిన సిద్ధూ
  • చాలాసేపు భేటీ సాగిందని కామెంట్
కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి నవజోత్ సింగ్ సిద్ధూ ఫొటోతో కౌంటర్ ఇచ్చారు. ప్రియాంక గాంధీతో చాలా సేపు సమావేశమయ్యానని ట్వీట్ చేస్తూ ఆ ఫొటోను పోస్ట్ చేశారు. వాస్తవానికి ప్రియాంక గాంధీని కలుస్తానని నిన్నే సిద్ధూ చెప్పారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు.. రాహుల్ ను ప్రశ్నించగా ఏ సమావేశమూ లేదని బదులిచ్చారు. ‘‘మీటింగ్ ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరితోనూ ఏ మీటింగూ లేదు’’ అని ఆయన చెప్పారు.

అయితే, రాహుల్ చేసిన ఆ వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్టుగా ఇవాళ ప్రియాంకతో సమావేశమైన ఫొటోను సిద్ధూ ట్వీట్ చేశారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ గొడవ బాగా ముదిరిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పై కొందరు నేతలు తిరుగుబాటు స్వరం వినిపించారు. అందులో సిద్ధూ కూడా ఉన్నారు. సీఎంను మారుస్తున్నారన్న ఊహాగానాలూ మొదలయ్యాయి. అయితే, వాటిన్నింటికీ చెక్ పెడుతూ కెప్టెనే సీఎం అని సోనియా గాంధీ ప్రకటించారు.

ఇటు ఆ గొడవను ఆపేందుకు రాహుల్, ప్రియాంకలూ రంగంలోకి దిగారు. నేతలను పిలిపించుకుని మాట్లాడారు. వచ్చే ఏడాదే ఎన్నికలుండడంతో ఇప్పుడు ఈ గొడవలు అంత మంచిది కాదని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
Congress
Rahul Gandhi
Priyanka Gandhi
Navjoth Singh Sidhu

More Telugu News