Allari Naresh: 'అల్లరి' నరేశ్ న్యూ మూవీ టైటిల్ .. 'సభకు నమస్కారం'
- 'నాంది'తో లభించిన హిట్
- పట్టాలపైకి కొత్త ప్రాజెక్టు
- కెరియర్ పరంగా 58వ సినిమా
- కొత్త దర్శకుడి పరిచయం
తెలుగు తెరపై హాస్యకథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. హాస్య కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్ తరువాత స్థానంలో నిలిచాడు. చాలా వేగంగా 50 సినిమాలకి పైగా చేశాడు. కామెడీనే కాదు .. కావలసినంత ఎమోషన్ ను కూడా పండించగలనని నిరూపించుకున్నాడు.
అలాంటి 'అల్లరి' నరేశ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన తాజా చిత్రం 'సభకు నమస్కారం' తాలూకు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగినట్టుగానే ఆయన సభకు నమస్కారం చేస్తున్న పోస్టర్ ను వదిలారు.
ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాతో, మల్లంపాటి సతీశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. 'నాంది' తరువాత 'అల్లరి' నరేశ్ చేస్తున్న సినిమా ఇది. కెరియర్ పరంగా ఇది ఆయనకు 58వ సినిమా. ఇకపై విభిన్నమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తానని ఈ మధ్య 'అల్లరి నరేశ్ చెప్పాడు. ఈ సినిమా టైటిల్ .. పోస్టర్ చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. త్వరలోనే ఇతర వివరాలు తెలియనున్నాయి.