High Speed Test Track: ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ పితంపూర్ లో ఆవిష్కరణ

Asia longest high speed test track inaugurated at Pithampur
  • పితంపూర్ లో టెస్ట్ ట్రాక్
  • వర్చువల్ గా ప్రారంభించిన జవదేకర్
  • ట్రాక్ పొడవు 11.3 కిలోమీటర్లు
  • కొత్త వాహనాలు పరీక్షించేందుకు ఉపయోగపడే ట్రాక్
భారత్ లో ఓ భారీ నిర్మాణం రూపుదిద్దుకుంది. ఆసియాలోనే అత్యంత పొడవైన టెస్ట్ ట్రాక్ ను పితంపూర్ లో ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వద్ద ఏర్పాటైన ఈ ఆటోమొబైల్ టెస్ట్ ట్రాక్ ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వర్చువల్ గా ప్రారంభించారు.

ఈ టెస్ట్ ట్రాక్ పొడవు 11.3 కిలోమీటర్లు. కార్ల తయారీ కంపెనీలు తమ కొత్త వాహనాలను, ఇతర పరికరాలను పరీక్షించుకోవడానికి ఈ టెస్ట్ ట్రాక్ ఉపయోగపడుతుంది. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 16 మీటర్ల వెడల్పుతో 4 లేన్ల ఈ అండాకార టెస్ట్ ట్రాక్ ఆసియాలో ఉన్న అన్ని టెస్ట్ ట్రాక్ ల కంటే పొడవైనది.

ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, భారత ఆవిష్కరణలు, నిర్మాణ రంగంలో ఇదొక కీలక ఘట్టం అని, ప్రధాని ప్రవచించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యాచరణలో గర్వించదగిన అంశం అని పేర్కొన్నారు.
High Speed Test Track
Pithampur
Indore
Asia
India

More Telugu News