AP Cabinet: రేపు ఏపీ క్యాబినెట్ భేటీ... నూతన ఐటీ విధానంపై చర్చ!

AP Cabinet will meet tomorrow
  • బుధవారం ఉదయం 11 గంటలకు భేటీ
  • సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రులు
  • ఐటీ విధానాన్ని ఆమోదించనున్న క్యాబినెట్
  • జల వివాదాలు, జాబ్ క్యాలెండర్ పైనా చర్చ
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇటీవల తీసుకువచ్చిన నూతన ఐటీ విధానంపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే సమావేశంలో ఐటీ విధానానికి ఆమోదం తెలుపనున్నారు. అంతేకాకుండా, జాబ్ క్యాలెండర్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో జల వివాదాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ, అమ్మఒడిలో భాగంగా విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
AP Cabinet
Jagan
Ministers
IT System
Andhra Pradesh

More Telugu News