Hrithik Roshan: నువ్వు ఇప్పటికీ 21 ఏళ్ల కుర్రాడిలా ఉన్నావు: హృతిక్ కు మాజీ భార్య సుసానే ప్రశంస

You are still looking 21 says Hrithik Roshan wife
  • ఇన్స్టాలో తన పిక్ ను పోస్ట్ చేసిన హృతిక్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
  • ప్రశంసలు కురిపించిన అనిల్ కపూర్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 47 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఆయన కండలు తిరిగిన శరీరం ఎందరో యువకులకు ఒక రోల్ మోడల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ గ్రీకు వీరుడిగా హృతిక్ కు పేరుంది.

తాజాగా హృతిక్ ఒక ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ పై ఆయన మాజీ భార్య సుసానే ఖాన్ కూడా స్పందించింది. నువ్వు ఇప్పటికీ 21 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నావని సుసానే కితాబునిచ్చింది. అనిల్ కపూర్ కూడా షర్ట్ లేకుండా ఉన్న హృతిక్ పిక్ పై స్పందించాడు. రోజురోజుకీ నీ శరీర సౌష్టవం పెరుగుతోందని ప్రశంసించాడు.
Hrithik Roshan
Bollywood
Wife
Sussane
Compliment

More Telugu News