Hyderabad: చదువు కోసం హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న విదేశీయుల అరెస్ట్

Arrest of foreigners who came to Hyderabad for education and engaged in prostitution
  • స్టడీ వీసాపై టాంజానియా నుంచి హైదరాబాద్‌కు
  • ‘మీట్ 24’ యాప్‌ ద్వారా వ్యభిచారం
  • దాడిచేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు
స్టడీ వీసాపై టాంజానియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ జంట వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. పోలీసుల కథనం ప్రకారం.. డయానా (24), కాబాంగిలా వారెన్ (24) స్టడీ వీసాపై గతేడాది జనవరిలో హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి తార్నాకలో ఉంటున్న వీరు రెండు నెలల క్రితం భార్యభర్తలమని చెప్పి నేరెడ్‌మెట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.

తర్వాత ‘మీట్ 24’ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న డయానా వ్యభిచారం నిర్వహిస్తోంది. వినియోగదారులను నేరుగా ఇంటికే పిలిపించుకునేది. అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేరెడ్‌మెట్ పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీసా గడువు ముగిసినప్పటికీ వారు అక్రమంగా ఇక్కడే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Tanzania
Study Visa
Police

More Telugu News