KCR: అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించలేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీటీడీపీ

TTDP Complaint on KCR to governor Tamilisai
  • కేసీఆర్ నేతృత్వంలో మొన్న అఖిలపక్ష సమావేశం
  • గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న టీడీపీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్
  • కేసీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం
దళితుల సాధికారతపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై గుర్రుగా ఉన్న తెలంగాణ టీడీపీ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు నిన్న ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పోలంపల్లి అశోక్ గవర్నర్‌కు పేర్కొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుకు నిరసనగా నిన్న ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ దళిత విభాగం తీర్మానం చేసినట్టు చెప్పారు. కాగా, దళితుల సమస్యలపై నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు ఇది వరకే కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం నుంచి టీటీడీపీ నేతలకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన మొన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన 32 మంది నేతలు హాజరయ్యారు.
KCR
All Party Meet
TTDP
Governor
Tamilisai Soundararajan

More Telugu News