Sajjala Ramakrishna Reddy: షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నారు... ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోం: సజ్జల

Sajjala comments on YS Sharmila party in Telangana
  • తాడేపల్లిలో సజ్జల ప్రెస్ మీట్
  • షర్మిల పార్టీపై స్పందన
  • ఆమెకు సొంత అభిప్రాయాలుంటాయన్న సజ్జల
  • వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడి
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై స్పందించారు. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ఆమె సొంతంగానే పార్టీ పెడుతున్నారని తెలిపారు. పార్టీ స్థాపన విషయంలో షర్మిలకు సొంత అభిప్రాయాలు ఉంటాయని, కానీ వైసీపీకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సజ్జల ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇందులో మరో ఆలోచనకు తావులేదని, తాము అప్రమత్తంగానే ఉంటామని వివరించారు.
Sajjala Ramakrishna Reddy
YS Sharmila
Party
Telangana
Andhra Pradesh
YSRCP

More Telugu News