Nayanatara: బాలీవుడ్ మూవీ కోసం నయన్ కి రెట్టింపు పారితోషికం?

Nayanatara takes Huge remuneration for Bollywood movie
  • కోలీవుడ్ లో తిరుగులేని  స్థానం
  • తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ 
  • బాలీవుడ్ ఎంట్రీ అంటూ టాక్
నయనతార ఏ ముహూర్తంలో కథానాయికగా కాలు పెట్టిందోగానీ, ఇంతవరకూ ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఆమెను బీట్ చేయడం కాదు గదా, ఆమె క్రేజ్ కి దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లలేకపోయారు. అలా సుదీర్ఘ కాలంగా ఆమె హవా కొనసాగుతూనే ఉంది. నయన్ కి తమిళ సినిమాలు చేతినిండా ఉంటూనే ఉంటాయి. అందువలన తనకి కుదిరితేనే ఆమె తెలుగు .. మలయాళ సినిమాలు చేస్తూ ఉంటుంది. ఈ రెండు భాషల్లో కూడా ఆమెకి విపరీతమైన క్రేజ్ ఉంది .. ఆమె సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. అలాంటి నయనతార ఇంతవరకూ హిందీలో మాత్రం చేయలేదు.

కానీ ఇప్పుడు ఆమె హిందీలో చేయడానికి అవకాశాలు ఉన్నాయనే టాక్ మాత్రం కోలీవుడ్ లో వినిపిస్తోంది. షారుక్ ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఒక బాలీవుడ్ సినిమా చేయడానికి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆలస్యమైంది కానీ, లేదంటే ఈ సినిమా ఈ పాటికి సెట్స్ పైకి వెళ్లేదే. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను అడుగుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్లు తీసుకుంటోందట. అంతకి రెట్టింపు ఇస్తామని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. మరి, ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుంటుందా అనేదే చాలామంది డౌటు!
Nayanatara
Sharukh Khan
Atlee Kumar

More Telugu News