Nara Lokesh: నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి: సీఎం జగన్ కు లోకేశ్ లేఖాస్త్రం

Nara Lokesh shot a letter to CM Jagan
  • నిరుద్యోగుల సమస్యలపై స్పందించిన లోకేశ్
  • మరోసారి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరిక
  • ఉత్తుత్తి క్యాలెండర్ తో నిలువునా ముంచారని వెల్లడి
  • సీఎం ముందు డిమాండ్ల చిట్టా
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు మరోసారి లేఖాస్త్రం సంధించారు. నిరుద్యోగుల డిమాండ్లను నెల రోజుల్లోగా నెరవేర్చాలని కోరారు. లేని పక్షంలో నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి మరో పోరాటం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్తుత్తి ఉద్యోగ క్యాలెండర్ తో నిరుద్యోగులను నిలువునా ముంచారని విమర్శించారు. 2.3 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని లోకేశ్ పేర్కొన్నారు.

"గ్రూప్-1, గ్రూప్-2 విభాగాల్లో 2 వేల పోస్టులతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి 30 రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంజినీరింగ్ విభాగాల్లో 20 వేలకు పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టాలి. రెవెన్యూ శాఖలో 740 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ.2 వేల నిరుద్యోగ భృతిని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగ యువకుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి" అంటూ డిమాండ్ చేశారు.
Nara Lokesh
CM Jagan
Letter
Unemployment
Andhra Pradesh

More Telugu News