Rashmika Mandanna: వీరాభిమానులకు రష్మిక రిక్వెస్ట్!

Rashmika Requested her fans
  • రష్మికపై విపరీతమైన అభిమానం
  • నేరుగా కర్ణాటకలోని ఆమె ఇంటికి వెళ్లిన అభిమాని
  • ఆ సమయంలో ముంబైలో ఉన్న రష్మిక
  • ఇకపై అలా చేయవద్దంటూ ఫ్యాన్స్ కి రష్మిక రిక్వెస్ట్  
వెండితెరపై వెలిగిపోయే తారలను దగ్గర నుంచి చూడాలనీ .. వాళ్లతో మాట్లాడాలని చాలామంది అభిమానులకు ఉంటుంది. అలాంటి సమయం కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. ఏదైనా సినిమా వేడుకలలో అలాంటి సమయం దొరికితే వేదికపైకి దూసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అభిమానులు తాము ఆరాధించే హీరోయిన్ షూటింగు ఫలానా చోట జరుగుతుందని తెలిస్తే, అష్టకష్టాలుపడి అక్కడికి చేరుకుంటూ ఉంటారు. కానీ ఒక వీరాభిమాని గూగుల్ ద్వారా సెర్చ్ చేసి మరీ 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి నేరుగా రష్మిక ఇంటికే వెళ్లిపోయాడు.

తెలుగు స్టార్ హీరోయిన్స్ రేసులో ఉన్న రష్మిక, తమిళంలోను భారీ హిట్లు కొట్టే దిశగా అడుగులు వేస్తోంది. పనిలో పనిగా బాలీవుడ్ లోను భారీ అవకాశాలనే అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రష్మికపై అభిమానాన్ని పారేసుకున్న ఓ యవకుడు, ఆమె నివాసం కర్ణాటక .. కొడగు సమీపంలోని 'విరాజ్ పేట' అని గూగుల్ ద్వారా తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లిపోయాడు.

అయితే, ఆమె ఆ సమయంలో ముంబైలో ఉంది. దాంతో ఆ అభిమాని నిరాశగానే వెనుదిరిగాడట. ఈ విషయం తెలిసి తనకి చాలా బాధ కలిగిందని రష్మిక ట్వీట్ చేసింది. ఏదో ఒక రోజు ఆ అభిమానిని తప్పకుండా కలుస్తాననీ, కాకపోతే ఇకపై ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని రిక్వెస్ట్ చేసింది.
Rashmika Mandanna
Pushpa
Tollywood

More Telugu News