Twitter: మరో వివాదంలో ట్విట్టర్... కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా చూపుతూ మ్యాప్!

Twitter shows India map without Jammu and Kashmir
  • కేంద్రం, ట్విట్టర్ మధ్య క్షీణించిన సంబంధాలు
  • కొత్త ఐటీ చట్టంపై ట్విట్టర్ విముఖత!
  • ఆగ్రహంతో ఉన్న కేంద్రం
  • తాజాగా భారత మ్యాప్ ను తప్పుగా చూపించిన ట్విట్టర్
ఇటీవల కాలంలో భారత ప్రభుత్వంతో ట్విట్టర్ సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. భారత కొత్త ఐటీ చట్టం అమలుకు మొండికేస్తున్న ట్విట్టర్ ఇప్పటికే పలు మినహాయింపులు కోల్పోయింది. ఈ క్రమంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య పోరు నడుస్తోంది. తాజాగా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ కొత్త వివాదంలో చిక్కుకుంది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ, భారతదేశ మ్యాప్ ను తప్పుగా చూపించింది. గతంలో ట్విట్టర్ లేహ్ ను చైనాకు చెందిన భూభాగం అని చూపించడం తెలిసిందే.

తాజాగా కశ్మీర్ ను దేశంగా చూపిస్తూ రూపొందించిన మ్యాప్ ను ట్విట్టర్ లోని ట్వీప్ లైఫ్ విభాగంలో పొందుపరిచారు. దీన్ని ఓ నెటిజన్ గుర్తించడంతో ఈ తప్పిదం వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై నెటిజన్లు ట్విట్టర్ ను ఏకిపారేస్తున్నారు. దీనిపై కేంద్రం తీవ్రస్థాయిలో స్పందించే అవకాశాలున్నాయి.
Twitter
India
Map
Jammu And Kashmir
Ladakh

More Telugu News