Revanth Reddy: వరుసగా కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తోన్న రేవంత్ రెడ్డి!
- పొన్నాలను కలిసిన రేవంత్
- మరోపక్క చిన్నారెడ్డితో భేటీ
- ఆసుపత్రిలో వీహెచ్ వద్దకు రేవంత్
- మరికొందరిని కూడా కలిసే అవకాశం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. అనంతరం చిన్నారెడ్డిని కూడా రేవంత్ కలిశారు. అక్కడి నుంచి హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న వి.హనుమంతరావును కలిసి పరామర్శించారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ వీహెచ్ రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు.
కాగా, ఈ రోజు మరికొంత మంది కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా తనకు మద్దతు తెలపాలని ఆయన కోరనున్నారు.
కాగా, ఈ రోజు మరికొంత మంది కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా తనకు మద్దతు తెలపాలని ఆయన కోరనున్నారు.