Kathi Mahesh: ఎడమ కన్ను చూపును పూర్తిగా కోల్పోయిన కత్తి మహేశ్?

Kathi Mahesh lost left eye sight
  • నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేశ్
  • చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్
  • ఈరోజు కళ్లకు ఆపరేషన్ నిర్వహించనున్న వైద్యులు
సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వెళ్తున్న లారీని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురైన వెంటనే ఆయనను నెల్లూరులోని ఓ ఆసుప్రతిలో చేర్పించారు. అనంతరం శనివారం రాత్రి చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో కత్తి మహేశ్ రెండు కళ్లు దెబ్బతిన్నాయి. ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ శ్రీరాములు తెలిపారు. ప్రమాదం వల్ల మెదడులో రక్తస్రావం జరగలేదని... అందువల్ల ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. మరోవైపు ఆయన కళ్లకు ఈరోజు వైద్యులు ఆపరేషన్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం కత్తి మహేశ్ వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఆయన కుటుంబసభ్యులతో పాటు కొందరు బంధువులు ఉన్నారు.
Kathi Mahesh
Tollywood
Eyes
Operation

More Telugu News