Corona Virus: కరోనాలో కొత్త వేరియంట్ ‘లాంబ్డా’.. వేగంగా విస్తరిస్తున్న వైరస్! 

New Lambda Variant found in peru last year
  • గతేడాది ఆగస్టులో పెరులో వెలుగుచూసిన వేరియంట్
  • దృష్టి సారించాల్సిన వైరస్ రకంగా పేర్కొన్న డబ్ల్యూహెచ్ఓ
  • పెరులోని మొత్తం కేసుల్లో 81 శాతం లాంబ్డా రకానివే
ఆల్పా, గామా, డెల్టా, డెల్టా ప్లస్ వంటి ప్రమాదకర కరోనా వేరియంట్ల స్థానంలో ఇప్పుడు ‘లాంబ్డా’ కూడా వచ్చి చేరింది. గతేడాది ఆగస్టులో పెరులో బయటపడిన ఈ రకం ఇప్పుడు 29 దేశాలకు విస్తరించింది. ఇందులో పెరు సహా చిలీ, ఈక్వెడార్, అర్జెంటినా వంటి దేశాలు ఉన్నాయి. ఈ వేరియంట్‌ను ‘దృష్టి సారించాల్సిన వైరస్ రకం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనగా, ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా బ్రిటన్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) పేర్కొంది. బ్రిటన్‌లో ఇప్పటి వరకు ఈ తరహా కేసులు ఆరు మాత్రమే వెలుగుచూశాయి.

ఏప్రిల్ నుంచి పెరులో బయటపడిన కొత్త కేసుల్లో ‘లాంబ్డా’ రకానికి చెందినవి ఏకంగా 81 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చిలీలో గత 60 రోజుల్లో ఈ కేసులు 32 శాతానికి పెరిగాయి. దీని స్పైక్ ప్రొటీన్‌లోని కొన్ని ఉత్పరివర్తనాల వల్ల ఇది ఉద్ధృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ వేరియంట్ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందని కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను ఇది ఏమారుస్తుందని కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని పీహెచ్ఈ పేర్కొంది.
Corona Virus
Lambda Variant
WHO
UK
PHE
Peru

More Telugu News