రేపు తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు వెల్లడి
- తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్
- ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు
- మార్కుల వెల్లడికి విధివిధానాలు ఖరారు
- రేపు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా
ఫస్టియర్ లో సంబంధిత సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో, సెకండియర్ లోనూ ఆ సబ్జెక్టులకు అన్నే మార్కులు ఇవ్వనున్నారు. ప్రాక్టికల్స్ కు మాత్రం ఫుల్ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఫెయిలైన సబ్జెక్టులకు పాస్ మార్కులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ విద్యార్థులు ఫలితాలతో సంతృప్తి చెందకపోతే, కరోనా పరిస్థితులు సద్దుమణిగాక వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు.