MS Raju: పదిహేనేళ్ల కుర్రాడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఎంఎస్ రాజు

MS Raju introduces teenager Samarth Gollapudi as music director
  • దర్శకుడిగా మారిన నిర్మాత ఎంఎస్ రాజు
  • డర్టీ హరి సినిమాతో విజయం
  • మరో సినిమా తెరకెక్కిస్తున్న వైనం
  • సమర్థ్ గొల్లపూడికి మ్యూజిక్ డైరక్టర్ గా చాన్స్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్ రాజు 'డర్టీ హరి' చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా అనంతరం ఎంఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్' చిత్రంతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు సొంత సంస్థ సుమంత్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. కాగా, ఈ చిత్రం కోసం ఎంఎస్ రాజు 15 ఏళ్ల కుర్రాడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఆ యువ సంగీత దర్శకుడి పేరు సమర్థ్ గొల్లపూడి.

ఈ సినిమా పాటలు కొత్తదనంతో ప్రేక్షకులను అలరించేలా ఉండాలని ఎంఎస్ రాజు కోరుకుంటున్నారు. అందుకే, ఫ్రెష్ ఆలోచనలతో కూడిన యువ సంగీత దర్శకుడైతే తమ చిత్రానికి తగిన బాణీలు ఇస్తాడని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దేవి శ్రీ ప్రసాద్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది ఎంఎస్ రాజే. తాజాగా, సమర్థ్ గొల్లపూడి కూడా సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. మరి, ఈ టీనేజ్ మ్యూజిక్ డైరెక్టర్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
MS Raju
Samarth Gollapudi
Music Director
7 Days 6 Nights

More Telugu News