Adithyanath Das: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం మరో మూడు నెలల పొడిగింపు

Centre extends AP CS Adithyanath Das tenure for a three months
  • 3 నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం
  • ఈ నెలాఖరుతో ముగియనున్న సీఎస్ పదవీకాలం
  • ఆదిత్యనాథ్ సర్వీసు పొడిగించాలని కోరిన ఏపీ సర్కారు
  • ఏపీ విజ్ఞప్తికి అంగీకరించిన కేంద్రం
నీలం సాహ్నీ పదవీవిరమణ అనంతరం ఏపీ సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. తాజాగా ఆయన పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 3 నెలల పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 30తో ఏపీ సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం ముగియనుంది. అయితే, ఆయన సర్వీసును పొడిగించాలని ఏపీ సర్కారు కేంద్రాన్ని కోరింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.... మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులు అనుసరించి ఏపీ సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు కొనసాగుతారు.
Adithyanath Das
Tenure
Extension
AP CS
Andhra Pradesh

More Telugu News