Manda Krishna: దళిత్ ఎంపవర్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా మొదలుపెట్టాడు: మంద కృష్ణ

Manda Krishna take a dig at CM KCR over Dalit Empowerment Scheme
తెరపైకి దళిత్ ఎంపవర్ మెంట్ అంశం 
రేపు ప్రగతిభవన్ లో అఖిలపక్ష సమావేశం
అఖిలపక్ష సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్న మంద కృష్ణ
తమను పిలవలేదంటూ అసంతృప్తి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ధ్వజమెత్తారు. సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకం ఓ బూటకం అని కొట్టిపారేశారు. దళితులను మరోసారి మభ్యపెట్టేందుకే కేసీఆర్ కొత్త డ్రామా షురూ చేస్తున్నాడని ఆరోపించారు. 2003 అక్టోబరు 17న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దళిత్ ఎంపవర్ మెంట్ కార్యాచరణలోని అంశాలను అఖిలపక్షం నేతలు గమనించాలని మంద కృష్ణ సూచించారు. ఆనాడు రాజకీయ కక్షలో భాగంగా తమను ఆహ్వానించలేదని తెలిపారు. ఇప్పుడు కూడా మాకు ఆహ్వానం అందలేదు అని వెల్లడించారు.

తెలంగాణ క్యాబినెట్, సీఎం సలహామండలిలో ఎంతమంది దళితులున్నారని మంద కృష్ణ ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు.

కాగా, రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ స్కీమ్ పేరిట తెలంగాణ సర్కారు ఓ కార్యాచరణ తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను చర్చించేందుకు రేపు ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీల ప్రతినిధులతో పాటు దళిత సంఘాల నేతలు కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమం నేపథ్యంలోనే మంద కృష్ణ స్పందించారు. అఖిలపక్షం ఏర్పాటు మంచి నిర్ణయమేనని, కానీ తమను పిలవకపోవడంతో అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు.
Manda Krishna
CM KCR
Dalit Empowerment
All Party Meeting

More Telugu News