Junior NTR: తొందరపడుతున్న ఎన్టీఆర్!

Ntr is excited to do his Tv Show
  • ముగింపు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • రెడీగా ఉన్న టీవీ షో
  • ఆగస్టు నుంచి కొరటాల సినిమా  
చాలా కాలంగా ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' ప్రాజెక్ట్ పైనే ఉన్నాడు. కరోనా అవాంతరాల కారణంగా షూటింగు విషయంలో మరింత జాప్యం జరుగుతూ వచ్చింది. అనుకున్న సమయానికి షూటింగు పూర్తయితే, ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరుడు' అనే కార్యక్రమానికి హోస్ట్ గా చేయవలసి ఉంది. ఆ టీవీ ఛానల్ వారు అందుకు సంబంధించిన ప్రోమోను కూడా వదిలారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు .. అటు టీవీ కార్యక్రమం ఆడిషన్స్ ఆలస్యమయ్యాయి.

అయితే ఆ టీవీ ఛానల్ వారు ఇప్పుడు చకచకా సన్నాహాలు చేసేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. దాంతో 'ఆర్ ఆర్ ఆర్'లో తన పోర్షన్ ను త్వరగా ముగించాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడట. వచ్చేనెలలో 'ఆర్ ఆర్ ఆర్' ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేస్తే, ఆ వెంటనే టీవీ షోకి వెళ్లిపోవచ్చని భావిస్తున్నాడట. ఇక కొరటాల సినిమా కూడా ఆగస్టు నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఎన్టీఆర్ ఫుల్ బిజీ అన్నమాట.
Junior NTR
Rajamouli
Koratala Siva

More Telugu News