కశ్మీర్ కు 370 ఆర్టికల్ ను పునరుద్ధరించేదాకా ఎన్నికల్లో పోటీ చేయం: మెహబూబా ముఫ్తీ
- కేంద్రం ఆ పనిచేయదని మాకు తెలుసు
- ఎప్పుడో ఒకప్పుడు చేసి తీరాల్సిందే
- దీనిపై గుప్కర్ కూటమి ఉద్యమిస్తుంది
భారత రాజ్యాంగం కల్పించిన హక్కునే తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 370ని రద్దు చేసి రాజ్యాంగాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. 370, 35ఏ పునరుద్ధరణను కోరుకోవడం వేర్పాటువాద డిమాండ్ కాదన్నారు. కశ్మీర్ కు రాష్ట్రహోదా, ఎన్నికల కోసమే తాను ప్రధానితో సమావేశం కాలేదన్నారు. అది తమ ప్రాధాన్యం కాదని ఆమె వివరించారు.