New Delhi: అది బీజేపీ ఆఫీసులో బీజేపీ నేతలు తయారుచేసిన నివేదిక: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి విమర్శలు

Delhi oxygen audit committee report doesnt exist Attacks Manish Sisodia
  • అసలు ఆడిట్ రిపోర్టే లేదన్న మనీశ్ సిసోడియా
  • ఆడిట్ కమిటీతో మాట్లాడామని కామెంట్
  • కమిటీ ఏ నివేదికా ఇవ్వలేదని వెల్లడి
ఆక్సిజన్ ఆడిట్ నివేదికపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు. సుప్రీం కోర్టు కమిటీ ఇచ్చిందని చెబుతున్న ఆ నివేదిక అసలు లేనే లేదు అని విమర్శించారు. అవసరానికి మించి ఢిల్లీ ప్రభుత్వం 4 రెట్ల ఆక్సిజన్ ను తీసుకుందని సుప్రీం కోర్టు నియమించిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన దానిపై వివరణ ఇచ్చారు.

ఏ నివేదికపైనా ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సంతకం చేయలేదని, అలాంటప్పుడు ఈ నివేదిక ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తాము ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సభ్యులతో మాట్లాడామన్నారు. ఆడిట్ కమిటీ నివేదిక ఇవ్వలేదని, ఈ నివేదిక బూటకమని అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేతలు తయారు చేసిన నివేదికదని విమర్శించారు. దమ్ముంటే ఆడిట్ కమిటీ సంతకం చేసిన నివేదికను బయట పెట్టాలని సవాల్ విసిరారు.
New Delhi
Manish Sisodia
Oxygen
COVID19
Supreme Court

More Telugu News