Maoist: మావోయిస్టు హరిభూషణ్ వారసుడిగా దామోదర్.. అగ్రనాయకత్వం నిర్ణయం?

Maoist leader Damodar to be the Successor of Haribhushan
  • ఇటీవల కరోనాతో మృతి చెందిన హరిభూషణ్
  • ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్న దామోదర్
  • సుదీర్ఘ అనుభం, పార్టీలో సీనియర్ కావడం కలిసొచ్చే అంశం
కరోనాతో మృతి చెందిన మావోయిస్టు నేత, తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ వారసుడిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దామోదర్ ప్రస్తుతం రాష్ట్ర పార్టీ మిలిటరీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుండడంతోపాటు యాక్షన్ బృందాలకు ఇన్‌చార్జ్‌గానూ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర కమిటీ సభ్యుడిగానూ ఉన్న ఆయనకు ఉత్తర తెలంగాణ వ్యవహారాలపై గట్టి పట్టు ఉండడంతో పగ్గాలను ఆయనకే అప్పగించాలని పార్టీ అగ్రనాయకత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి తోడు రాష్ట్ర పార్టీలో సీనియర్ కావడం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలని చెబుతున్నారు. అలాగే, గతంలో ఏటూరు నాగారం-భూపాలపల్లి ఏరియా, కరీంనగర్-ఖమ్మం-వరంగల్ కార్యదర్శిగానూ దామోదర్ పనిచేశారు.
Maoist
Harbhushan
Damodar
Telangana
Maoist Party

More Telugu News