BJP: హుజూరాబాద్ ఉపఎన్నిక.. బీజేపీ ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ

BJP appoints mandal incharges for Huzurabad by polls
  • ఈటల రాజీనామాతో హుజూరాబాద్ కు ఉపఎన్నిక
  • మండలాలకు ఇన్ఛార్జిలను నియమించిన బీజేపీ
  • నియోజకవర్గ కోఆర్డినేటర్ గా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికే హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమయిందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది.

మరోవైపు, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం మండల ఇన్ఛార్జిలను బీజేపీ నియమించింది. హుజూరాబాద్ టౌన్ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాశ్ రెడ్డి, జమ్మికుంటకు ఎంపీ అరవింద్, జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, వీణవంకకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంటకు మాజీ ఎంపీ సురేశ్ రెడ్డి, కమలాపూర్ కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ లను నియమించారు. నియోజకవర్గ కోర్డినేటర్ గా బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని నియమించింది.
BJP
Huzurabad
By Polls
Incharges

More Telugu News