America: కరోనాను తరిమికొట్టాలన్న లక్ష్యానికి అడ్డంగా డెల్టా వేరియంట్: ఆంథోనీ ఫౌచీ

Anthony Fauci calls Delta variant greatest threat to US pandemic response
  • అమెరికాలో కొత్త కేసులకు కారణం అవుతున్న డెల్టా వేరియంట్
  • కొత్త కేసుల్లో 20 శాతం ఈ రకానివే
  • డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం
  • మన దగ్గరున్న ఆయుధాలతో పారదోలుదామన్న ఫౌచీ
కరోనా వైరస్‌లోని డెల్టా వేరియంట్‌పై అమెరికా వైట్‌హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను తరిమికొట్టేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇది తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత్‌లో తొలుత వెలుగుచూసిన ఈ వేరియంట్ అమెరికాలో కొత్త కేసులకు కారణం అవుతోంది. రెండు వారాల క్రితం 10 శాతంగా ఉన్న డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య ప్రస్తుతం 20 శాతానికి పెరిగినట్టు శ్వేతసౌధంలో మహమ్మారిపై నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఫౌచీ పేర్కొన్నారు.

డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని, వ్యాధి తీవ్రతకు కూడా ఇది కారణం అవుతోందని డాక్టర్ ఫౌచీ అన్నారు. ఈ వేరియంట్‌ను అడ్డుకునేందుకు మన వద్ద ఉన్న ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించుకుందామని పిలుపునిచ్చారు. ఫైజర్, మోడెర్నా టీకాలతోపాటు అమెరికాలో అందుబాటులో ఉన్న టీకాలన్నీ డెల్టా వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. కాగా, భారత్‌లో కరోనా వైరస్ రెండోసారి చెలరేగి పోవడానికి డెల్టా వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించిన ఈ వేరియంటే.. ఇంగ్లండ్‌లో కొత్త కేసుల పెరుగుదలకు కూడా కారణమని చెబుతున్నారు.
America
Delta Varant
Threat
Corona Virus

More Telugu News