Etela Rajender: కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన ఈటల రాజేందర్

Etela Rajender fires on KCR
  • అధికారం కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారు
  • డబ్బులు, కుట్రలను నమ్ముకుని ఎన్నికలకు వస్తారు
  • హుజూరాబాద్ ప్రజల ముందు ఆయన డబ్బులు పని చేయవు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శనాస్త్రాలకు మరింత పదును పెడుతున్నారు. ఈరోజు ఆయన కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.

ఒడ్డు ఎక్కేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు ఎక్కిన తర్వాత బోడ మల్లన్న తరహాలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారం కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని దుయ్యబట్టారు. డబ్బులు, కుట్రలను నమ్ముకుని ఆయన ఎన్నికలకు వస్తారని ఆరోపించారు. అయితే హుజారాబాద్ ప్రజల ముందు కేసీఆర్ డబ్బులు, కుట్రలు పని చేయవని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని హుజూరాబాద్ ప్రజలు అమ్ముకోరని చెప్పారు.
Etela Rajender
BJP
KCR
TRS

More Telugu News