Varla Ramaiah: ఈ ప్రభుత్వాన్ని చూసి నేరస్తులు భయపడడంలేదు: వర్ల రామయ్య

Varla Ramaiah criticizes AP govt and CM Jagan
  • రాజధాని ప్రాంతంలో అత్యాచారం
  • సీఎం ఇంటికి సమీపంలోనే జరిగిందన్న వర్ల
  • ప్రభుత్వం తలదించుకోవాలని వ్యాఖ్యలు
  • సీఎం దర్యాప్తును పర్యవేక్షించాలని హితవు
అమరావతి ప్రాంతంలో జరిగిన ఘోర అత్యాచార ఘటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. నేరస్తులు ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడడంలేదన్న విషయాన్ని తాజా ఘటన నిరూపిస్తోందని పేర్కొన్నారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఒక యువతిని, ఆమె ప్రియుడిని బంధించి సామూహిక అత్యాచారం జరపడం పట్ల ప్రభుత్వం తలదించుకోవాలని విమర్శించారు. ఇకనైనా సీఎం అన్ని పనులు ఆపి, కంట్రోల్ రూంలో కూర్చుని క్షణక్షణం దర్యాప్తును పర్యవేక్షించాలని వర్ల రామయ్య హితవు పలికారు. ముద్దాయిలు దొరికితేనే దశ 'దిశ' అని స్పష్టం చేశారు.
Varla Ramaiah
AP Govt
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News