Varla Ramaiah: ఆ ఇద్దరు పోలీసు అధికారులపై రాజద్రోహం కేసులు పెట్టాలి: ఏపీ గవర్నర్‌కు వర్ల రామయ్య లేఖ

Varla Ramaiah writes letter to AP Governor demanding sedition case against CID officers
  • సీఐడీ అధికారి సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై చర్యలు తీసుకోండి
  • ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని దళిత యువతను ప్రోత్సహిస్తున్నారు
  • డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు
సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై చట్టబద్ధమైన చర్యలను తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని దళిత యువతను వీరిద్దరూ ప్రోత్సహిస్తున్నారని లేఖలో ఆరోపించారు.

వీరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తాను ఫిర్యాదు చేశానని... అయినప్పటికీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సివిల్ కాండక్ట్ రూల్స్ ను ఉల్లంఘించి, ఉగ్రవాదులను సమర్థించే విధంగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు అధికారులపై రాజద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Varla Ramaiah
Telugudesam
AP Governor
Biswabhusan Harichandan
CID
PV Sunil Kumar
Moka Sahti Babu

More Telugu News