Nepal: అప్పుడు భారత్ అనే దేశమే లేదు.. నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

Yoga originated in Nepal not in India claims Nepal PM Oli
  • యోగా నేపాల్‌లోనే పుట్టిందన్న కేపీ శర్మ ఓలి
  • తమ ఋషుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పలేకపోయామని ఆవేదన
  • ఈ విషయంలో మోదీ సఫలమయ్యారన్న నేపాల్ ప్రధాని
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన అధికారిక నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఓలి మాట్లాడుతూ.. యోగా నేపాల్‌లోనే పుట్టిందన్నారు. నిజానికి ఈ ప్రపంచానికి యోగా పరిచయం అయినప్పుడు భారత్ అనే దేశమే లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగాను తమ ఋషులే కనుగొన్నారని, అయితే వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ సఫలమయ్యారని అన్నారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో మోదీ ప్రతిపాదించడంతో దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. కాగా, నేపాల్ ప్రధానికి వివాదేలేమీ కొత్త కాదు. గతంలో శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Nepal
India
Yoga
KP Sharma Oli

More Telugu News