Hanmakonda District: వరంగల్ అర్బన్ జిల్లా ఇకపై హన్మకొండ జిల్లా... సీఎం కేసీఆర్ ప్రకటన

Warangal urban district renamed as Hanmakonda district
  • వరంగల్ అర్బన్ జిల్లా పేరు మార్పు
  • కొత్తగా హన్మకొండ జిల్లాగా నామకరణం
  • వరంగల్ రూరల్ జిల్లా ఇకపై వరంగల్ జిల్లా
  • త్వరలో ఉత్తర్వులు
గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ప్రకటించిన వరంగల్ అర్బన్ జిల్లాను ఇకపై హన్మకొండ జిల్లాగా మార్చుతున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పరిగణిస్తారని స్పష్టత నిచ్చారు. త్వరలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.

ఇకమీదట వరంగల్, హన్మకొండ జిల్లాలు ఉంటాయని వివరించారు. జిల్లా పేరు మార్పుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ వారంలోనే వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో పాలన పరంగా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని, 'కలెక్టర్' అనే పేరును కూడా మార్చాల్సి ఉందని, ఇది బ్రిటీష్ కాలం నాటి పేరు అని అన్నారు.
Hanmakonda District
Warangal Urban District
Warangal Rural District
Warangal District
CM KCR
Telangana

More Telugu News