KCR: తెలంగాణ భావజాల వ్యాప్తిలో గూడ అంజయ్య ఎంతో కృషి చేశారు: సీఎం కేసీఆర్​

CM KCR Pays Tribute To Guda Anjaiah on His Death Anniversary
  • వర్ధంతి సందర్భంగా నివాళులు
  • పాటతో చైతన్యం రగిల్చారని కామెంట్
  • ఆయన ఆశయాలను నిజం చేస్తున్నామన్న సీఎం
ఉద్యమ సమయంలో తెలంగాణ భావజాలాన్ని నలుమూలలా వ్యాపింపజేయడంలో గూడ అంజయ్య ఎంతో పరితపించారని సీఎం కేసీఆర్ అన్నారు. గూడ అంజయ్య వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు. తన పాట ద్వారా ఉద్యమంలో అంజయ్య ఎంతో కృషి చేశారన్నారు. సబ్బండ వర్గాల జీవన తాత్వికతకు, సాంస్కృతిక చైతన్యానికి ఆయన పాట చిరునామాగా నిలిచిందన్నారు.

స్వయం పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలన్న అంజయ్య ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తోందన్నారు. అందుకోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అందిస్తున్నామన్నారు. తద్వారా తెలంగాణలోని సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నామని, అదే అంజయ్యకు ఘన నివాళి అని చెప్పారు.
KCR
Telangana
Guda Anjaiah

More Telugu News