శ్రీరాముడి పేరుతో సేకరించిన నిధులను బీజేపీ నేతలు దోచుకుంటున్నారు: కాంగ్రెస్ అధికార ప్రతినిధి విమర్శలు
- రామ మందిర నిర్మాణం కోసం జరిగిన భూముల కొనుగోళ్లలో అవకతవకలు
- రూ. 20 లక్షలకు కొన్న భూమిని బీజేపీ నేత రూ. 2.5 కోట్లకు విక్రయించారు
- విచారణ జరిపించాల్సిన బాధ్యత మోదీ, సుప్రీంకోర్టుదే
- కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా
ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజేపీ నేత ఒకరు అయోధ్యలో 890 చదరపు మీటర్ల భూమిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసి 79 రోజుల తర్వాత ఆ భూమిని రామజన్మభూమి ట్రస్టుకు రూ. 2.5 కోట్లకు విక్రయించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని, ప్రధాని ఆధ్వర్యంలోనే రామజన్మభూమి ట్రస్టు ఏర్పాటైంది కాబట్టి ఈ అక్రమాలపై స్పందించి విచారణ జరిపించాల్సిన బాధ్యత కూడా వారిదేనని సూర్జేవాల స్పష్టం చేశారు.