ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
- ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురుకి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం గురించి హైకోర్టు చర్చించడం ఇబ్బందికరంగా ఉందన్న సుప్రీం
- ఈ చట్టం గురించి తామే వివరించాల్సి ఉందని వ్యాఖ్య
ఢిల్లీలోని జేఎన్యూ, జామియా విద్యా సంస్థల విద్యార్థులు నటాషా, దేవాంగన, ఆసిఫ్ లకు ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ అప్పీళ్లపై విచారణ జరిపేందుకు మాత్రం అంగీకరించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ముగ్గుర్నీ ఆదేశించింది. ఈ ముగ్గురుకీ బెయిల్ మంజూరు చేసిన తీర్పును భవిష్యత్తులో ఇతర న్యాయస్థానాలు అనుసరించరాదని ఆదేశించింది. ముగ్గురు విద్యార్థుల తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.