Gummanuri Jayaram: లోకేశ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు: మంత్రి జయరాం ఫైర్

Minister Jayaram fires on Nara Lokesh
  • కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల హత్య
  • సీఎం జగన్ లక్ష్యంగా లోకేశ్ వ్యాఖ్యలు
  • లోకేశ్ ను ప్రజలే తరిమికొడతారన్న మంత్రి 
  • గతంలో వైసీపీ నేత హత్యకు గురైనప్పుడు లోకేశ్ ఏమయ్యాడని ప్రశ్న   
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాపరెడ్డి హత్యలపై సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, లోకేశ్ పై ఏపీ మంత్రి గుమ్మునూరు జయరాం మండిపడ్డారు.

పిచ్చెక్కి మాట్లాడుతున్న లోకేశ్ ను ప్రజలే తరిమికొడతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీకి 151 అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిపించిన ధీరుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. నీ తండ్రి కనీసం నిన్ను కూడా గెలిపించుకోలేకపోయాడు అంటూ మంత్రి జయరాం ఎద్దేవా చేశారు. మంగళగిరిలో లోకేశ్ ను ప్రజలు తరిమికొట్టారని పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య జరిగిందని, టీడీపీ నేతలే నారాయణరెడ్డిని చంపేశారని, అప్పుడు లోకేశ్ ఏమయ్యాడని ప్రశ్నించారు. ఏంచేసినా కర్నూలులో టీడీపీకి భవిష్యత్ ఉండదని జయరాం స్పష్టం చేశారు.
Gummanuri Jayaram
Nara Lokesh
Jagan
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News