Narishma Reddy: 50 లక్షలు ఖర్చు చేసినా దక్కని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం

Software engineer died with Corona after spending Rs 50 lakhs
  • పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన నరిష్మరెడ్డి
  • కరోనా బారిన పడిన వైనం
  • వైరస్ ప్రభావం ఊపిరితిత్తులపై పడటంతో కన్నుమూత

పెళ్లి చేసుకుని, కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జీవితాన్ని కరోనా వైరస్ చిదిమేసింది. కరోనా మహమ్మారి ఆ యువతి ప్రాణాలు తీసింది. 40 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందింది.

వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన పెండ్యాల రవీందర్ రెడ్డి కుమార్తె నరిష్మరెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఏడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. పెళ్లి చేసుకోవడానికి సొంతూరుకు తిరిగొచ్చింది. మే నెలలో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే అంతలోనే ఆమెకు కరోనా సోకింది.

కరోనాకు చికిత్స తీసుకుని ఆమె కోలుకుంది. అయితే, కరోనా ప్రభావం ఆమె ఊపిరితిత్తులపై పడింది. దీంతో, ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. 40 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చివరకు కన్నుమూసింది. చికిత్స కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ అమ్మాయి ప్రాణం దక్కలేదని ఆమె కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News