Allu Arjun: 'పుష్ప' విషయంలో రష్మిక ఫుల్ హ్యాపీ!

Rashmika is happy on Pushpa movie
  • ముగింపు దశలో 'పుష్ప'
  • రెండు భాగాలుగా రిలీజ్
  • హిట్ ఖాయమంటున్న రష్మిక  
టాలీవుడ్ లో టాప్ త్రీ హీరోయిన్లలో రష్మిక పేరు కనిపిస్తుంది. అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా రష్మికకు పుష్కలంగా ఉంది. అందువల్లనే ఆమె సినిమాలు వరుసగా భారీ విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. తెలుగులో ఆమె తాజా చిత్రంగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొదటి  భాగానికి సంబంధించి ఇప్పటికే 80 శాతం చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంతవరకూ నేను చేయని పాత్ర ఇది. ఆడియన్స్ కి నా పాత్ర వెంటనే కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా రెండు భాగాలలోను నేను కనిపిస్తాను. నాకు ఇష్టమైన పాత్రలో .. రెండు భాగాలలోను నేను కనిపించనుండటం నాకు మరింత సంతోషాన్ని కలిగించే విషయం. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చింది.
Allu Arjun
Rashmika Mandanna

More Telugu News