Girl Child: చెక్కపెట్టెలో పసికందు... గంగా నదిలో కొట్టుకొచ్చిన వైనం!

Girl child in a box spotted in Ganges river
  • నాడు గంగానదిలో కర్ణుడు దొరికిన ఘటన
  • అదే రీతిలో కొట్టుకొచ్చిన పెట్టె
  • పాపతో పాటు పెట్టెలో జాతకచక్రం
  • పాప పేరు గంగ అని గుర్తించిన పోలీసులు
మహాభారతంలో కర్ణుడి జననం, అతిరథుడికి ఎలా దొరికాడన్నది అందరికీ తెలిసిన విషయమే. కన్యగా ఉన్న కుంతి సూర్యభగవానుడి అంశతో జన్మించిన కర్ణుడిని ఓ చెక్కపెట్టెలో ఉంచి గంగానదిలో వదిలివేస్తుంది. ఇప్పుడదే రీతిలో ఓ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో జరిగింది. ఇక్కడి గంగా నదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకురాగా, ఓ జాలరి దాన్ని గుర్తించాడు. ఆ పెట్టె తెరిచి చూడగా, సజీవంగా వున్న పాప కనిపించింది. ఆ పెట్టెలో దుర్గామాత బొమ్మలు, ఆ పాప జాతకచక్రం కూడా ఉన్నాయి. కాగా, ఆ పాప పేరు గంగ అని జాతకచక్రంలో చూసి తెలుసుకున్నారు.

జాలరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ పసికందును ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మూడు వారాల వయసున్న ఆ శిశువు ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. ఇప్పుడా చిన్నారి తల్లిదండ్రులు ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొన్ని తాంత్రిక క్రియల్లో భాగంగానే ఇలా చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు పరిశోధిస్తున్నారు.
Girl Child
Ganga River
Uttar Pradesh
Police

More Telugu News