Vijay Sai Reddy: 4 డిక్షనరీలను బాబు, లోకేశం, అచ్చెన్న, ఉమలకు అందజేయండి!: విజయసాయిరెడ్డి సెటైర్

Vijayasai Reddy says govt distributes dictionaries to students
  • జగనన్న విద్యాకానుక కింద డిక్షనరీలు
  • 23.59 లక్షల మందికి పంపిణీ
  • జగన్ సర్కారు నిర్ణయమన్న విజయసాయి
సమయోచితంగా విమర్శలు చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి జగన్ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రైవేటు విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా రాణించాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని వివరించారు. జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు కావాల్సినవన్నీ ఇస్తున్నారని వెల్లడించారు.

తాజాగా, విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని తెలిపారు. రాష్ట్రంలో 23.59 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లీషు భాషలో నైపుణ్యం పెంచుకోవడానికి ఈ డిక్షనరీలు ఉపయోగపడతాయని విజయసాయి వివరించారు.

ఈ సందర్భంగా ఆయన పొలిటికల్ సెటైర్ వేశారు.  "4 డిక్షనరీలను బాబు, లోకేశం, అచ్చెన్న, ఉమలకు అందజేయాలని విద్యాశాఖ అధికారులకు నా విన్నపం" అని వ్యంగ్యం ప్రదర్శించారు.
Vijay Sai Reddy
Oxford Dictionaries
Students
Jagan
Andhra Pradesh

More Telugu News