కడప జిల్లాలో దారుణం.. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు
- ప్రేమించిన యువకుడిని పెళ్లాడతానన్న కూతురు
- కుదరదని చెప్పిన తల్లిదండ్రులు
- కూతురు ససేమిరా అనడంతో హత్యాయత్నం
తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోబోనని సదరు యువతి స్పష్టం చేసింది. దీంతో, ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురై, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.