Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన పదిమంది దుర్మరణం

Major Road Accident in Gujarat 10 dead
  • ఆనంద్‌పూర్ జిల్లా తారాపూర్ సమీపంలో ఘటన
  • వేగంగా దూసుకొచ్చి కారును ఢీకొన్న కారు
  • కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా తారాపూర్ సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. కారును అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించినట్టు పోలీసులు తెలిపారు.

ప్రమాదం కారణంగా రహదారి రక్తసిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తారాపూర్ రెఫరల్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Gujarat
Tarapur
Road Accident

More Telugu News